Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. వరుస బెదిరింపుల వెనుక అసలు కారణాలు ఇవే!

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. వరుస బెదిరింపుల వెనుక అసలు కారణాలు ఇవే!
x

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. వరుస బెదిరింపుల వెనుక అసలు కారణాలు ఇవే!

Highlights

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్‌ ప్రయాణికులు, విమానయాన శాఖ సిబ్బందితో పాటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్‌ ప్రయాణికులు, విమానయాన శాఖ సిబ్బందితో పాటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ బాంబు బెదిరింపు ఘటనలు అధికం అవుతున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించడం, తనిఖీలు చేపట్టడం ఇలా చక చక జరిగిపోతున్నాయి. గత నెలలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపు మెయిల్ రావడంతో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఇలా వరుస పెట్టి వస్తున్న మెయిల్స్‌ కారణంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు మెయిళ్లపై అధికారులు చేపడుతున్న దర్యాప్తులలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను కాస్త భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే.. సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ టేకి ఏకంగా అతడి మెయిల్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు.. దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్‌పోర్టులు ఇంకా క్రీడా మైదానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. ఇంకా వ్యక్తిగత ద్వేషాలతోనూ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకా ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు తనతో సరిగా ప్రవర్తించలేదని ఒకరు.. మతి స్థిమితం లేని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తి చేసుకునేందుకు కూడా ఐలాంటి ఫేక్ మెయిల్స్ పంపుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే వీళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీళ్లంతా సాధారణ మెయిల్స్ ద్వారా కాకుండా వీటిని ప్రత్యేక యాప్ ద్వారా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి మెయిల్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. వరుసగా వస్తున్న బ్రిట్స్ మెయిల్స్ ఇటీవల ఒకే ఐడీతో పలుమార్లు వచ్చిన సందర్భాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఇప్పటికే 4కేసుల్లో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని మస్కట్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. అదే టైంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి కూడా ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్ పెట్టారు. ఇలా ఒకే టైంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్‌గా చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా ఐసోలేషన్‌కు పంపించి విమానంలో తనిఖీ చేపట్టారు. మరో కువైట్ విమానంలో కూడా అక్కడి అధికారులు తనిఖీలు చేపట్టారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు కొత్త కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి థ్రెట్నింగ్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. గత నెలలో మూడు సార్లు దుండగులు మెయిల్స్ పెట్టారు. నవంబర్‌ ఒకటో తేదీన ఇండిగో విమానంలో పేలుడు పదార్థాలు ఉంచామని ఉదయం ఐదున్నరకు మెయిల్ వచ్చింది. దీంతో ఇండిగో-68 ఫ్లైట్‌ను డైవర్ట్ చేశారు. అనంతరం విమానంలో తనిఖీలు చేసి అది ఫేక్ అని తేల్చారు. అక్కడికి పది రోజులు పోయిన తర్వాత నవంబర్‌ 12న మరో మెయిల్ వచ్చింది. ఇలా వరుసగా ఇలాంటి మెయిల్స్ రావడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లవలసిన విమానాలను దారి మళ్లించి.. వేరే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తూ తనిఖీలు చేపడుతున్నారు అధికారులు.

ఇక ఈ నెలలో ఐదు రోజుల్లోనే మూడు కిపైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇలా తరచూ మెయిల్స్ రావడం అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేయడం సర్వసాధారణంగా మారుతోంది. కానీ ఇలా ఫేక్ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫేక్ మెయిల్స్ పైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకోని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories