సనాతన హైందవ ధర్మానికి సజీవ సాక్ష్యం.. పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం

సనాతన హైందవ ధర్మానికి సజీవ సాక్ష్యం.. పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం
x
Highlights

వానరసేన రాయి రాయి పేర్చి రామసేతు నిర్మించిందని విన్నాం ఇప్పుడు భక్తసేన అద్భుత ఆలయ నిర్మాణానికి పూనుకుంది. భక్తినే శక్తిగా మలిచి ఆధ్యాత్మిక...

వానరసేన రాయి రాయి పేర్చి రామసేతు నిర్మించిందని విన్నాం ఇప్పుడు భక్తసేన అద్భుత ఆలయ నిర్మాణానికి పూనుకుంది. భక్తినే శక్తిగా మలిచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మిస్తోంది. సనాతన హైందవ ధర్మానికి సజీవ సాక్ష్యంగా భక్తలోకానికి స్ఫూర్తిగా అపురూప ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణానికి ప్రాకృతిక పదార్థాలే ముడిసరుకులు ఆధ్యాత్మిక గురువులే మెస్త్రీలు భక్తులే కూలీలు ఇంతటి ఆమోఘమైన ఆలోచన ఎవరిది ఆ క్షేత్ర నిర్మాణం ఎక్కడ జరుగుతుందో వీక్షించి, తరించండి.

ఆధ్యాత్మికతను స్ఫూరిస్తున్న ఈ ప్రాంతం సంగారెడ్డి మండలం పసల్ వాది గ్రామంలోని జ్యోతిర్వాస్తు విద్యా పీఠం. ఇరవై ఏళ్లుగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ పీఠం వేదికగా నిలుస్తోంది. పీఠం నిర్వాహకులైన మహేశ్వర సిద్ధాంతికి ఓ వినూత్న ఆలోచన తట్టింది. భారతీయ ప్రాచీన సంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రీ చక్ర ఆకారంలో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ ఆలోచనకు ప్రతి రూపమే శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం.

అనుకున్నదే తడవుగా ఈ మహాయజ్నాన్ని మొదలుపెట్టారు. ఒకటిన్నర ఎకరాలో 2017 జూన్ 14 న ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆధ్యాత్మిక నిర్మాణానికి అందరు అంగీకరించారు సహకరించారు. పూర్తిగా ప్రాకృతిక పదార్థాలను వినియోగిస్తూ అష్ట దాతువులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 32 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆలయంలో ఎక్కడా కూడా సిమెంట్, ఇనుము వాడిన ఆనవాళ్లు కనిపించవు.

శతాబ్ధాలు గడిచినా చెక్కుచెదరని క్షేత్రాలు ఈ దేశంలో కొకొల్లలు అలాంటి శక్తివంతమైన రాతి కట్టడం సంగారెడ్డిలో రూపుదిద్దుకుంటోంది. సుమారు 6వేల ఏళ్ల పాటు ఈ ఆలయం ఉండాలన్న మహా సంకల్పంతో నిర్మాణం జరుగుతోంది. అందుకే పునాదుల నుంచి శిఖరం వరకు ప్రకృతి ధాతువులనే వాడుతున్నారు. ధార్మికవేత్తలు, వాస్తు శిల్పులు , ఆర్కిటెక్చర్లు, స్థపతులు, ఇంజినీయర్ల అనుభావాల సమూహమే ఈ మహాలయ నిర్మాణం. సనాతన భారతీయ శిల్పకళా సంపదన ఒకే వేదికపై ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

మానవ శరీరం మాదిరిగానే ఆలయం ఉంటుందని క్షేత్ర నిర్వాహకులు చెబుతున్నారు. మానవుని శరీరంలో ఎన్ని భాగాలున్నాయో ఈ ఆలయంలో కూడా అన్ని భాగాలుంటాయట. ఆలయంలో 128 పద్మ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 128 శకటాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆలయం చుట్టూ తాబేళ్లు నిర్మిస్తున్నారు. ఇవి బుద్ధికి సంకేతం. ఆలయం లోపల అష్ట సిద్ధులకు సంకేతమైన ఎనిమిది గజాలను ఎనిమిది సర్పాలను నిర్మిస్తున్నారు. ఇవి మనిషిలోని గుణాలకు అద్దం పడతాయి. ఇలా ఆలయంలో జరిగే ప్రతి నిర్మాణం మానవ జీవన విధానానికి సంకేతం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రాచీన సంస్కృతిక సమ్మేళనం ఈ ఆలయం. విష్ణు ధర్మోత్తర పురాణం ఆధారంగా ఆలయ నిర్మాణం జరుగుతోంది. భూమిలో దొరికే సున్నం, జనుము, బెల్లం, కరక్కాయల జిగురు, బంక, మారెడు రసాన్ని నిర్మాణంలో వాడుతున్నారు. 108 నదీ జలాలతో భూమి శుద్ధి చేశారు. ప్రకృతి ప్రకోపాలకు తట్టుకునేలా పునాదిని నిర్మించారు. పునాది రాళ్లను క్రమపద్ధతిలో పేర్చి శ్రీ బంధనం చేశారు. జీరో సైజ్ నుంచి 32 అడుగుల ఎత్తు వరకు భారీ బండరాళ్లతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒక్కో రాయి బరువు ఐదు టన్నులుంటుంది. కర్నాటక నుంచి శుద్ధమైన బెల్లం, సున్నం తెప్పించారు. మంజీర నదిలోని ఇసుకను వాడుతున్నారు. విష్ణు బంధనం, రుద్ర బంధనం, శక్తి బంధనం, శ్రీ బంధనాలను నిర్మించి వీటి పై దేవతా మూర్తులను తీర్చిదిద్దనున్నారు. మరో రెండేళ్లలో సంపూర్ణ ఆలయం దర్శనమివ్వనుందని క్షేత్ర నిర్వాహకులు చెబుతున్నారు. భక్తులు సమకూర్చిన 3 కోట్ల రూపాయాలతో నిర్మాణం ప్రారంభించారు. మరో 10 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories