‌కరోనాతో కుదేలైన ఉమ్మడి వరంగల్‌ జిల్లా మిర్చి రైతులు

‌కరోనాతో కుదేలైన ఉమ్మడి వరంగల్‌ జిల్లా మిర్చి రైతులు
x
Highlights

కరోనా వైరస్ మహమ్మరి ధాటికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా మిర్చి రైతులు కుదేలు అవుతున్నారు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు కోల్డ్ స్టోరేజీల కొరత, ఇంకో వైపు అకాల...

కరోనా వైరస్ మహమ్మరి ధాటికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా మిర్చి రైతులు కుదేలు అవుతున్నారు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు కోల్డ్ స్టోరేజీల కొరత, ఇంకో వైపు అకాల వర్షాలు ఇలా మిర్చి రైతుకు దెబ్బమీద దెబ్బ అన్న చందంగా మారింది. ఉత్తర తెలంగాణలో ప్రధాన పంట అయిన మిర్చి రైతుల కష్టాలపై hmtv స్పెషల్ స్టోరీ.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడికి దేశం అంత లాక్‌డౌన్ విధించారు. దీంతో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు విస్తృత ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కానీ దీని అంతం ఇంకా సాధ్యం కావడం లేదు. కానీ సోషల్ డిస్టెన్స్‌తో కోవిడ్19 చైన్‌ను అరికట్ట గలుగుతున్నాం. కానీ రైతుల కష్టాలను మాత్రం తీర్చలేక పోతున్నాయి ప్రభుత్వాలు. ముందస్తు చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో అవి జరగక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవి కాలంలో వేసే ప్రధాన పంట మిర్చి. గత నాలుగు నెలల కష్టార్జితం చేతికొచ్చే సమయానికి మొత్తం బంద్ అయ్యింది. దీంతో కూలీలు దొరకక, దొరికిన మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోల్డ్‌స్టోరేజీలకు తరలించాలని రైతులను కోరింది ప్రభుత్వం. అయితే అవసరానికి తగినన్ని లేకపోవడంతో రైతులు సతమతం అవుతున్నారు. ఆలస్యం కావడంతో కూలి రేట్లు, స్టోరేజి రెంట్‌తో రైతుపై అధిక భారం పడుతుంది. మరోవైపు ఎండకు కాయ తెల్లబడటంతో ధర తగ్గుతుందని దిగులు చెందుతున్నారు.

ఒక వేళ ఇవన్నీ దాటి వెళ్లినా మద్దతు ధర రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితులతో పాటు ప్రకృతి కూడా రైతులపై కన్నెర్ర చేస్తోంది. కోత పంటను కల్లాల్లో అరబెట్టిన రైతులకు అకాల వర్షం మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే పరదాలు లేక బ్యాగ్‌లు దొరక్క అయోమయంలో ఉన్న రైతులకు వర్ష ముప్పు మరోసారి దెబ్బ తీసేలా ఉందని కల్లాల్లో మిర్చి పోసిన రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే కరోనా దెబ్బకు కుదేలు అవుతుంటే రైతు కంట కన్నీరు కారుతుంది. లాక్‌డౌన్‌తో కూలీల కొరత మిర్చి మార్కెట్ లేక ఎండకు తెల్లబడి దిగుబడి కోల్పోతుంది. లాక్‌డౌన్ అనంతరం ప్రభుత్వం ఆదుకొని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories