గుత్తా-కంచర్ల కథలో కొత్త మలుపేంటి?

గుత్తా-కంచర్ల కథలో కొత్త మలుపేంటి?
x
Highlights

వారిద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు నడిపారు. ఆ తర్వాత వారిద్దర్నీ అదే పార్టీ దూరమయ్యేలా చేసింది. ఒకరు పార్టీని వీడి, మరో...

వారిద్దరిదీ ఒకే ఊరు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు నడిపారు. ఆ తర్వాత వారిద్దర్నీ అదే పార్టీ దూరమయ్యేలా చేసింది. ఒకరు పార్టీని వీడి, మరో పార్టీలో చేరితే, మరొకరు అదే పార్టీలో కొనసాగారు. ఇక ఇలా ముందుకు సాగుతూనే అదే రాజకీయం ఆ ఇద్దరిని ఒకే పార్టీలోకి తీసుకువచ్చింది. అయితే ఆయన తన రాజకీయ జీవితంలో అవుదామనుకున్న ఎమ్మెల్యే కాలేకపోయారు. కానీ శిష్యుడు లాంటి నేత మాత్రం ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎమ్మెల్యే కాలేదన్న బాధ నుంచి, ఇపుడా నేత ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఒకే ఊరు నుంచి రాష్ట్ర్ర రాజకీయాల్లో గురు శిష్యులుగా ఉండి, ఇపుడు ఒకరు ఎమ్మెల్సీ మరొకరు ఎమ్మెల్యే ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు..వాచ్ దిస్ స్టొరీ.

గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర్ర రాజకీయాలలో అందరికీ సుపరిచమైన నాయకుడు. చిట్యాల గ్రామం ఉరుమడ్ల నుంచి వార్డు మెంబర్‌గా మొదలైన గుత్తా ప్రస్ధానం, మదర్ డైరీ చైర్మన్, ఎంపీగా ఇలా అనేక పదవుల దాకా సాగింది. అయితే తొలుత సిపిఎంలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ తర్వాత టీడీపీలో, అటు నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఉరుమడ్ల నుంచే గుత్తా సుఖేందర్ రెడ్డి వెంట అన్ని విధాలుగా, రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచిన నేతలు కంచర్ల బ్రదర్స్. ఇందులో కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి ఉన్నారు.

కంచర్ల భూపాల్ రెడ్డి ప్రస్తుతం నల్లగొండ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే,. గుత్తా సుఖేందర్ రెడ్డి నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లే క్రమంలో, సుఖేందర్ రెడ్డికి కంచర్ల బ్రదర్స్‌కు రాజకీయంగా వైరుధ్యం ఏర్పడింది. దీంతో ఆ వైరుధ్యం కాస్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కంచర్ల బ్రదర్స్‌కు, గుత్తా సుఖేందర్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది.

ఇక ఉరుమడ్లలో గుత్తా, కంచర్ల కుటుంబాల మధ్య వైరుధ్యం, 2009 నుంచి 2017 వరకు కొనసాగింది. 2009లో గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అదే సమయంలో కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగారు. 2014లో నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేయగా, కంచర్ల భూపాల్ రెడ్డికి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా ఫోటీ చేశారు. ఊరు నుంచి మొదలైన వర్గపోరు ఊరికేపోదు అన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తన శక్తియుక్తులు ప్రయోగించి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయంలో కీలకపాత్ర వహించారు. స్వతంత్ర అభ్యర్ధిగా నిలిచిన కంచర్ల భూపాల్ రెడ్డి ఓటమికి పావులు కదిపారు. ఇలా ఇద్దరికీ కూడా ఆ ఎన్నికల తర్వాత కలిసి రాలేదని చెప్పవచ్చు.

టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, మారిన పరిస్ధితులతో గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. అయితే అప్పటికే కంచర్ల బ్రదర్స్ చేసిన కాంట్రాక్ట్ పనులకు గుత్తా సుఖేందర్ రెడ్డి బిల్లులు రాకుండా అడ్డుకున్నారని రాజకీయంగా చర్చ జరిగింది. ఇక మారుతున్న పరిస్ధితుల్లో కంచర్ల భూపాల్ రెడ్డి, టీడీపీని వదిలి అను‌హ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. చేరిన సమయంలోనే కంచర్ల భూపాల్ రెడ్డికి నల్లగొండ నియోజక వర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు అదే ఏడాది వచ్చిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలిజాబితా 105 మందిలో కంచర్ల భూపాల్ రెడ్డి పేరు కూడా ఉంది.

నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించినా, కోదాడ, హుజూర్ నగర్‌లలో టికెట్లు ప్రకటించలేదు. ఇక్కడ ఏదో ఓ చోట గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేయాలని టిఆర్ఎస్ అధిష్టానం సూచించినా, సుఖేందర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంతూరుకే చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ముగిసాయి. కేవలం రైతు సమన్వయ సమితి చైర్మన్‌గానే కొనసాగారు గుత్తా.

అయితే హుజుర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీగా గెలవడంతో, హుజుర్ నగర్‌కు ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజుర్ నగర్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ అని పుకార్లు షికార్లు చేస్తుండగా, గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని సంకల్పించారు టిఆర్ఎస్ అధినేత. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాత్రం ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్న కళ మాత్రం అలానే మిగిలిపోతోంది.

తన ఊరుకే చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కావడం, తాను మాత్రం టీడీపీ, కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి, టీఆర్ఎస్‌లో రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఉండి, చివరికి ఎమ్మెల్యే పోటీకి అవకాశం వచ్చినా, రాజకీయ సమీకరణాలతో పోటీ చేయలేక ఎమ్మెల్సీ అవుతున్న పరిస్థితి.

టీడీపీ నుంచి దూరమైనా, ఉరుమడ్లకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల కుటుంబం అదే ఉరుమడ్ల నుంచి రాష్ట్ర్ర రాజధాని వరకు 2009 నుంచి 2018 వరకు రాజకీయంగా విమర్శలు,కేసులు, సర్పంచ్, పాల సంఘం ఛైర్మన్, మదర్ డైయిరీ డైరెక్టర్ ఎన్నిక వరకు, ఇలా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడిచింది. కానీ అదే ఇద్దరు నేతలను మాత్రం టీఆర్ఎస్ పార్టీ దగ్గర చేసింది. అయితే గురువు ఎమ్మెల్సీ, శిష్యుడు ఎమ్మెల్యేగా గెలవడం యాధృచ్చికమే అయినా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డిల రాజకీయమే ఉదహరణ అంటున్నారు పొలిటికల్ పండితులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories