Janvi Kapoor: మధురానగర్ ఆంజనేయస్వామి గుడిలో జాన్వీకపూర్ ప్రత్యేక పూజలు
Janvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ హైదరాబాద్ లో సందడి చేశారు. మధురానగర్ లోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
Janvi Kapoor: బాలీవుడ్ నటి, దివంగత నటీ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హైదరాబాద్ వచ్చారు. సినిమాల విరామ సమయంలో ఆమె తరచుగా ఆలయాలను సందర్శిస్తారు. ఎందుకంటే జాన్వీకపూర్ కు భక్తి ఎక్కువ అని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా జాన్వీ కపూర్ హైదరాబాద్ లోని మధురానగర్ లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు జాన్వీ కపూర్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ హైదరాబాద్ కు వచ్చిందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు.
Next Story




