అక్క మెప్పుకోసం ఎమ్మెల్యేల తంటాలెందుకు?

అక్క మెప్పుకోసం ఎమ్మెల్యేల తంటాలెందుకు?
x
Highlights

అక్క మెప్పు కోసం.. ఆ ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నారా..? స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులను, పోటీ పడి మరీ కారెక్కించడం వెనుక అసలు కారణం అదేనా....? ...

అక్క మెప్పు కోసం.. ఆ ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నారా..? స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులను, పోటీ పడి మరీ కారెక్కించడం వెనుక అసలు కారణం అదేనా....? ఒంటరిగా గెలిచే సంఖ్యా బలం ఉన్నా.. ఇతర పార్టీలకు గాలం వేసేందుకు సదరు ఎమ్మెల్యేల పోటీ వెనుక ఉద్దేశమేంటి? సీఎం కేసీఆర్ దగ్గర క్రెడిట్ కోసమా ఆ మాజీ ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకా....? ఇందూరు గులాబీ పార్టీలో జరుగుతున్న ఆప్ ది రికార్డ్ చర్చ ఏంటి?

నిజామబాద్ జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వలసలకు శ్రీకారం చుట్టిందట. ఈ విషయంలో గులాబీ ఎమ్మెల్యేల మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోందట. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు పని గట్టుకుని కవిత ఓటమికి కారణమయ్యారనే ప్రచారం జరిగింది. పార్టీ అధినేతతో పాటు మాజీ ఎంపీ కవిత దగ్గర, కొందరు ఎమ్మెల్యేలకు అంతగా ప్రాధాన్యం లేదట. పొరపాటు చేశామని కుమిలిపోతున్న ఎమ్మెల్యేలకు, స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక రూపంలో తమ నిజాయితీ చాటుకునే అవకాశం వచ్చిందట. అందుకే ఎమ్మెల్యేలు పోటీ పడి బీజేపీ- కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గులాబీ గూటికి చేరుస్తున్నారట. ఈపాటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు జడ్పీటీసీలు, ఒక బీజేపీ జడ్పీటీసీ, 20మంది ఎంపీటీసీలు, ఐదుగురు కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. వీరి వలసల వెనుక ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల కృషి ఉందట. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డితో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ నెలరోజులుగా ఆపరేషన్ ఆకర్ష్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయట.

స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన కవితకు, 80శాతం మంది స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధుల బలం ఉంది. ఐనా, ఇతర పార్టీల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను సైతం గులాబీ గూటికి చేరుస్తూ, ఎమ్మెల్యేలు చెమటోడుస్తున్నారు. ఎమ్మెల్యేల మధ్య ప్రస్తుతం పోటీ కొనసాగుతోంది. ఒక్కో ఎమ్మెల్యే ఎంత మందిని ప్రజా ప్రతినిధులను గూలాబీ గూటికి తీసుకొచ్చారనే అంశంపై ఎప్పటికప్పుడు అధిష్ఠానం నివేదికలు తెప్పించుకుంటోందట. నెలరోజులుగా అధికార పార్టీలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. ఉప ఎన్నిక వాయిదా పడ్డా, ఎన్నికల కోడ్ ను ఎత్తేసినా వలసలు మాత్రం ఆగడం లేదట. నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా చూసేందుకు వలసలు ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యేలు సన్నిహితుల వద్ద చెబుతున్నా సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవితను ప్రసన్నం చేసుకునేందుకేనని పార్టీలో చర్చ జరుగుతోంది. ఐతే ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ బలోపేతం కోసం వలసలు దోహదపడతాయని పైకి చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన తమ ప్రాభవాన్ని తిరిగి పొందెందుకు ఇందూరు ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ లో బిజీబిజీగా మారారు. ఉప ఎన్నికల పరీక్షల్లో.. ఏ ఎమ్మెల్యే అధిష్ఠానం దృష్టిలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా గుర్తింపు పొందుతారో చూడాలి మరీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories