Shiva Balakrishna: శివబాలకృష్ణకు ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ

Shiva Balakrishna: HMDA డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బినామీల పేర్ల మీద.. భారీ అక్రమాస్తులు కూడబెట్టిన శివబాలకృష్ణ

Jyothi
Published on: 19 Feb 2024 10:51 AM IST
Special Focus on HMDA Shiva Balakrishna Corruption Case
X

Shiva Balakrishna: శివబాలకృష్ణకు ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ

Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్‌గా శివబాలకృష్ణకు బినామీల కేంద్రంగా ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. బినామీలను ఆఫీస్‌కు పిలిచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్‌, అటెండర్‌ల‌తో పాటు బంధువుల పేర్ల మీద భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 2020-23 మధ్య బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన అక్రమాస్తుల వివరాలను ఏసీబీ అధికారులు రాబట్టారు.

IAS అరవింద్‌కుమర్‌కు CRP160 నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. అరవింద్‌కుమర్‌ ఆదేశాలతో శివబాలకృష్ణ కొన్ని వెంచర్లకు అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరవింద్‌కుమర్‌ ఆదేశాలతో అనుమతులు ఇచ్చిన ఫైల్స్‌ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. రియల్టర్ల నుంచి అరవింద్‌కుమర్‌ భారీగా లబ్ది పొందినట్లు అనుమానిస్తున్నారు. అరవింద్‌కుమర్‌ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story