నెరవేరనున్న యాదాద్రి జిల్లా వాసుల దశాబ్దాల కల

నెరవేరనున్న యాదాద్రి జిల్లా వాసుల దశాబ్దాల కల
x
Highlights

ఒక్కొక్క మెట్టూ దాటుతూ పరుగులు పెడుతోన్న గోదారమ్మ త్వరలోనే యాదాద్రి భువనగిరికి చేరుకోనున్నాయి. జిల్లా రైతుల దశాబ్దాల కల నెరవేరబోతుంది. వీలైనంత వేగంగా...

ఒక్కొక్క మెట్టూ దాటుతూ పరుగులు పెడుతోన్న గోదారమ్మ త్వరలోనే యాదాద్రి భువనగిరికి చేరుకోనున్నాయి. జిల్లా రైతుల దశాబ్దాల కల నెరవేరబోతుంది. వీలైనంత వేగంగా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటిని పంపేలా పనులు వేగవంతం చేశారు అధికారులు. నెలలోపే నీరందించేలా పనులు ముమ్మరంగా సాగుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి జిల్లా రైతులు.

యాదాద్రి భువనగిరి జిల్లాను త్వరలోనే గోదావరి జలాలు తడపనున్నాయి. కొండపోచమ్మ‌ సాగర్‌ ప్రాజెక్ట్ ప్రారంభంతో జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్‌ పనులు ఊపందుకున్నాయి. 11.93 టిఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తోన్న ఈ జలాశయం పనులను యుద్ద ప్రాతిపదికన జరుపుతున్నారు అధికారులు.

బస్వాపూర్ రిజర్వాయర్‌ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో చేర్చింది. అయితే టీఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరంలోని పదహారవ ప్యాకేజీ కిందకు చేర్చి నిర్మిస్తోంది. ఆలేరు,ఆత్మకూరు, భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మండలాల్లో సాగు, తాగు నీరు అందించటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌‌ను 2 వేల 650 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్నారు. ఈ జలాశయం ద్వారా 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో పాటు ఆలేరు ,భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా నీరు ఇచ్చేలా ఫ్లాన్ చేసారు. యాదాద్రిలోని ప్రధాన‌ ఆలయంతో పాటు అన్ని ప్రాంతాలకు ఈ రిజర్వాయర్‌ నుంచే తాగు నీరు అందనుంది.

ఎగువనున్న జలాశయాలు ఎత్తిపోతలతో నిండుతుండటంతో గ్రావిటీ ద్వారా బస్వాపూర్ జలాశయానికి జులై మొదటి వారానికే నీటిని నింపేందుకు పనులు జరుగుతున్నాయి. ముందుగా ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల నీటిని తరలించే అవకాశాలున్నాయి. దీంతో ఆలేరు ,భువనగిరి నియోజకవర్గాలతో పాటు చౌటుప్పల్, రామన్నపేట ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బస్వాపూర్‌ రిజర్వాయర్‌తో ఆలేరు వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందన్నారు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఇక త్వరలోనే బస్వాపూర్‌కు నీరు వస్తుండటంతో ఆలేరు‌ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల చెరువుల‌ను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని మండలాలలోని రైతులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories