TS BJP: తెలంగాణపైన బీజేపీ స్పెషల్ ఫోకస్.. అగ్రనేతలతో బహిరంగ సభలకు ప్లాన్

TS BJP: పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీలో పాల్గొనడానికి ప్లాన్ చేస్తున్న బీజేపీ

Shekhar G
Updated on: 21 Sept 2023 10:00 PM IST
Special Focus Of BJP National Leadership On Telangana
X

TS BJP: తెలంగాణపైన బీజేపీ స్పెషల్ ఫోకస్.. అగ్రనేతలతో బహిరంగ సభలకు ప్లాన్

TS BJP: తెలంగాణపైన బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. బహిరంగసభల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జె.పి.నడ్డా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ముగ్గురు నేతలతో ఉమ్మడి 10 జిల్లాలో బహిరంగ సభలకు కసరత్తు చేస్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు ఖరారయ్యే అవకాశం కన్పిస్తోంది. లోక్ సభలో మహిళాబిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళలతో ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నారు. అమరవీరుల స్థూపం నుండి బిజెపి కార్యాలయం వరకు భారీ ర్యాలీకి నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీలో పాల్గొనేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story