Vikarabad: ఆకాశం నుంచి కింద పడిన వింత వస్తువు.. 'ఆదిత్య 369' తరహాలో..

Space Balloon Flight Found At Vikarabad
x

Vikarabad: ఆకాశం నుంచి కింద పడిన వింత వస్తువు.. ‘ఆదిత్య 369’ తరహాలో..

Highlights

Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం ఆకాశం నుండి పడింది.

Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం ఆకాశం నుండి పడింది. చూడటానికి ఆదిత్య 369సినిమాలో మాదిరిగా గుండ్రంగా ఉందంటూ ప్రచారం సాగుతుండటంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ పరికరానికి చుట్టు కెమరాలతో ప్యారచూట్‌ను పోలి ఉంది. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలనికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ వింత ఆకారాన్ని తమ ఫోన్ కెమెరాలలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. క్షణాల్లోనే ఆ వింతవుకు సంబంధించిన వార్త వైరల్ అవడంతో సైంటిస్టులు స్పందించారు. ఈ వింత వస్తువుపై క్లారిటీ ఇచ్చారు. అది ఒక బెలూన్ అని ప్రకటించారు. వాతావరణాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే భారీ హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు సైంటిస్టులు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories