సూర్యాపేట జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం

*'జయహో జగదీష్‌రెడ్డి' అంటూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రాసాద్ నినాదాలు

Rama Rao
Updated on: 16 Sept 2022 7:00 PM IST
SP Comments addressing Minister Jagadeesh Reddy as Baahubali
X

సూర్యాపేట జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం

Suryapet: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో జిల్లా SP రాజేంద్రప్రసాద్ స్టేజ్‌పై చేయించిన నినాదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌.. 'జయహో జగదీష్‌రెడ్డి' అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక ముందున్న వారితో కూడా ఎస్సీ.. 'జయహో జగదీషన్న' అంటూ నినాదాలు చేయించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. జిల్లా పోలీస్‌ బాస్‌ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story