తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు

South West Monsoon Advance In To Telangana
x

 తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు 

Highlights

తెలంగాణలో ఇవాళ్టి నుంచి వచ్చే రాబోయే 3రోజులు వర్ష సూచన

Weather Report: తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. మే19న రుతుపవనాలు బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఇవాళ్టి నుంచి వచ్చే రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉదయమంతా పొడి వాతావరణం ఉంటూ సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories