ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. వెంటనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశం

Soon The Notification For 50,000 Jobs Will Be Released in Telangana
x

కేసీఆర్‌(ఫైల్ ఇమేజ్ )

Highlights

Jobs Notification: ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Jobs Notification: ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వెంటనే 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఆదేశించారు. అన్ని శాఖల్లో కలిపి తొలి దశలో 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలన్న కేసీఆర్‌ తక్షణమే ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. అలాగే, ప్రమోషన్ల తర్వాత ఖాళీ అయ్యే ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేసేందుకు నివేదిక సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, నూతన జోనల్ విధానం ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గత పాలనలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉండేదన్న సీఎం కేసీఆర్‌ స్థానికులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఎంతో శ్రమంతో అత్యంత శాస్త్రీయతతో జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశామన్నారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. తొలి దశలో 50వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీ అయ్యే ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories