హైదరాబాద్‌ బేగంపేటలో సోనూసూద్ సందడి!

హైదరాబాద్‌ బేగంపేటలో సోనూసూద్ సందడి!
x

హైదరాబాద్ లో సోనూ సూద్ సందడి 

Highlights

అభిమాని ఇంటికి వచ్చిన సోనూసూద్

లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.. ఇప్పుడు హైదరాబాద్‌లో తన పేరు మీద అభిమాని నడుపుతున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళ్లి అతడికి సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. హైదరాబాద్‌‌కు చెందిన అనిల్ బేగంపేట్‌లో లక్ష్మి సోనూసూద్ పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతడికి సోనూసూద్ అంటే ఎంతో అభిమానం.. హైదరాబాద్‌ వచ్చినప్పుడు తన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి రావాలని ట్వీట్ చేశాడు..

ట్వీట్ చూసిన సోనూసూద్ అభిమానికి తెలియకుండా.. బేగంపేటకి వచ్చాడు. తన అభిమాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి.. కొద్దిసేపు అతడితో మాట్లాడాడు. తన అభిమాన హీరో రావడంతో అనిల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భక్తుడు అడిగిన వరాన్ని ఇవ్వడంలో దేవుడైనా కొద్దిగా లేటు చేస్తాడేమో కానీ, అభిమాని కోరికను మాత్రం వెంటనే తీర్చే వ్యక్తి సోనూసూద్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories