చిన్నారికి హార్ట్‌ సర్జరీ చేయించిన సోనూసుద్‌!

చిన్నారికి హార్ట్‌ సర్జరీ చేయించిన సోనూసుద్‌!
x
Highlights

లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.

లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి గాను ఇటివల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది.

ఇక ఇది ఇలా ఉంటే సోనూసూద్‌ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ పేద కుటుంబానికి చెందిన చిన్నారికి వైద్యం చేయించారు. కృష్ణా జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన కోటమ్మ కుమార్తె గాయత్రి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. సర్జరీ చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో.. జన విజ్ఞాన వేదిక కార్యదర్శి రామ్ ప్రదీప్ సోనూసుద్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సోనూసుద్‌ పాపకు ఆపరేషన్‌ చేయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories