Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తల్లిదండ్రులకు గుడి కట్టిన కుమారులు

Siddipet: * గోసానుపల్లి గ్రామంలో రాజాగౌడ్‌, సత్తమ్మల విగ్రహ ప్రతిష్ఠాపన

Sandeep Reddy
Updated on: 4 Oct 2021 11:36 AM IST
Sons who Built a Temple for Their Parents in Dubbak Siddipet district | Telugu Online News
X

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తల్లిదండ్రులకు గుడి కట్టిన కుమారులు

Siddipet: తల్లిదండ్రులను పట్టించుకోని నేటి సమాజంలో, 20 ఏళ్ల క్రితం మృతిచెందిన తల్లిదండ్రులకు విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసానుపల్లి గ్రామంలో చంద్రాగౌడ్‌, వెంకట్‌ గౌడ్‌ వారి తల్లిదండ్రులను దైవంగా కొలుస్తూ పూజలు చేస్తున్నారు.


క్రీస్తు శేషులు రాజా గౌడ్‌, సత్తమ్మల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అర్చకులచే నిర్వహించారు. చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమను ఎంతో కష్టపడి పెంచి పోషించారని, ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండటానికి వాళ్లే కారణమంటున్నారు చంద్రాగౌడ్‌ కుటుంబం. అందుకే తమ పిల్లలు కూడా మరచిపోకూడదనే ఉద్దేశ్యంతో గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story