Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సోనియాగాంధీ

Sonia Gandhi To Attend Revanth Reddy Swearing In Ceremony
x

Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సోనియాగాంధీ

Highlights

Revanth Reddy: మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చ

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. రేపు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు. ఆయనను మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కలిసారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా హైకమాండ్ పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మాణిక్కం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ పెద్దలందరినీ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories