Sonia Gandhi: సోనియా గాంధీకి మాతృవియోగం

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 31 Aug 2022 6:42 PM IST
Sonia Gandhi Mother Passes Away
X

Sonia Gandhi: సోనియా గాంధీకి మాతృవియోగం

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఈనెల 27న సోనియా గాంధీ తల్లి పౌలా మైనో ఇటలీలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ సీనియర్‌ నేత ​జైరాం రమేశ్ బుధవారం వెల్లడించారు. పౌలా మృతదేహానికి మంగళవారమే అంతిమ సంస్కారాలు కూడా పూర్తయినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు.

అయితే..సోనియా గాంధీ కొద్దిరోజుల క్రితమే ఇటలీ వెళ్లినట్లు సమాచారం. వైద్యపరీక్షల కోసం ఆమె విదేశాలకు వెళ్తున్నారని కాంగ్రెస్​పార్టీ గత వారం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ ఆమెకు తోడుగా వెళ్తారని వెల్లడించారు. అయితే, సోనియా ఎక్కడికి, ఎప్పుడు వెళ్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఢిల్లీకి వచ్చేముందు అస్వస్థతతో ఉన్న తన తల్లిని సోనియా పరామర్శిస్తారు అని జైరాం రమేశ్‌ తెలిపారు. ఇంతలోనే సోనియా తల్లి మరణించారని, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారని ఆయన వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story