Duddilla Sridhar Babu: తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ

Duddilla Sridhar Babu: ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి

Shekhar G
Published on: 4 Nov 2023 2:32 PM IST
Sonia Gandhi Gave Telangana Says Duddilla Sridhar Babu
X

Duddilla Sridhar Babu: తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ

Duddilla Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ ప్రజలు సంక్షేమం, అభివృద్ధికి పాటు పడుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. కన్నాల గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో, పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నామినేషన్ కు ముందు శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,సోనియా గాంధీ అని.. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణా ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story