Sangareddy: మామని హత్య చేసిన అల్లుడు

Sangareddy: మామని హత్య చేసిన అల్లుడు
x
Highlights

Sangareddy: భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఓ అల్లుడు మామను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.

Sangareddy: భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఓ అల్లుడు మామను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘోరం సంగారెడ్డి జిల్లా బీరంగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీరంగూడకు చెందిన చంద్రయ్య (58) కూతురు లక్ష్మి, అదే గ్రామానికి చెందిన రామకృష్ణను 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, మూడు నెలల క్రితం రామకృష్ణ తన పెద్ద కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో, భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.

అప్పటి నుంచి రామకృష్ణ తరచూ అత్తారింటికి వచ్చి లక్ష్మితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో, గురువారం రాత్రి రామకృష్ణ ఎప్పటిలాగే అత్తారింటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ వాగ్వాదం తీవ్రం కావడంతో కోపంలో రామకృష్ణ తన మామ చంద్రయ్యను కత్తితో దారుణంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

మామను హత్య చేసిన తర్వాత నిందితుడు రామకృష్ణను అక్కడే ఉన్న బంధువులు అడ్డుకుని కొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories