తాండూర్‌లో దారుణం.. ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

వికారాబాద్ జిల్లాలో మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతుంది. 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇవ్వనందుకు కక్ష పెంచుకున్నాడు ఓ అల్లుడు.

Arun Chilukuri
Published on: 7 Nov 2025 12:16 PM IST
తాండూర్‌లో దారుణం.. ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు
X

తాండూర్‌లో దారుణం.. ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

వికారాబాద్ జిల్లాలో మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతుంది. 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇవ్వనందుకు కక్ష పెంచుకున్నాడు ఓ అల్లుడు. యాలాల మండలం బెన్నూర్‌లో నివాసముంటున్న కృష్ణ తన కూతురుని కర్ణాటకకు చెందిన అర్జున్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అయితే మామ పేరుపై ఉన్న 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు తమకు ఇవ్వాలంటూ అల్లుడు, కూతురు కృష్ణపై ఒత్తిడి తెచ్చారు.

ఈ క్రమంలో వారి మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి కోసం తన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అల్లుడు. దీంతో గాయాల పాలైన కృష్ణను తాండూర్‌ ప్రభుత్వా‎స్పత్రికి తరలించారు స్థానికులు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కూతురు అనిత, అర్జున్‌పై యాలాల పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story