తండ్రిని కొట్టి చంపిన తనయుడు

Arun Chilukuri
Published on: 28 Feb 2021 10:32 AM IST
తండ్రిని కొట్టి చంపిన తనయుడు
X

తండ్రిని కొట్టి చంపిన తనయుడు

నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కన్నకొడుకే అతిదారుణంగా హత్యచేశాడు. గ్రామంలో నివసిస్తున్న సంగన రవి అతని తండ్రి పెద్ద రాజన్న మధ్య ఆస్తిగొడవలు తలెత్తాయి. రవి సోదరుడు కల్యాణ్ వారం రోజుల క్రితమే గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చాడు. మొదట అతనిపై కొడవలితో దాడి చేశాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని అరెస్ట్ చేసి, మందలించి వదిలిపెట్టారు. అదే రోజు రాత్రి వదినపైకి దాడికి యత్నించాడు. ఇక అర్థరాత్రి తర్వాత తండ్రిని రాయితో మోది చంపేశాడు. పోలీసులు నిందితుడిని కస్టడీలో ఉంచితే ఈ హత్య జరిగేదే కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story