Somireddy: జగన్‌కు సోమిరెడ్డి సవాల్: 'దమ్ముంటే అసెంబ్లీకి రా, ఏ చర్చకైనా మేము సిద్ధం'

Somireddy: జగన్‌కు సోమిరెడ్డి సవాల్: దమ్ముంటే అసెంబ్లీకి రా, ఏ చర్చకైనా మేము సిద్ధం
x
Highlights

ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై...

ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు.

"సభకు రాకుండా షరతులు పెట్టడం పిరికిపంద చర్య" అని సోమిరెడ్డి విమర్శించారు. "దమ్ముంటే సభకు రావాలి కానీ, ఇలా షరతులు పెట్టుకుని ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు" అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ముఖ్యమంత్రి, స్పీకర్‌పై జగన్ చేస్తున్న అనవసర ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు.

గతంలో ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ పార్టీ కూడా సభను బహిష్కరించలేదని సోమిరెడ్డి గుర్తుచేశారు.

1994లో కాంగ్రెస్: 1994లో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లు వచ్చినా, ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఆ పార్టీ నాయకులు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

1984లో టీడీపీ: 1984లో లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదని, అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడిందని ఉదహరించారు. ఆ నాయకులెవరూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదని ఎద్దేవా చేశారు.

అలాగే, వైఎస్సార్సీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం వల్ల వారి నియోజకవర్గాల ప్రజలు నష్టపోతున్నారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories