Hyderabad: హాట్‌ కేకులా అమ్ముడుపోయిన భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్లు

Hyderabad: ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి నేటి నుంచి టికెట్ల పంపిణీ

Rama Rao
Updated on: 23 Sept 2022 9:01 AM IST
Sold out IND - AUS T20 Match Tickets | Telugu News
X

Hyderabad: హాట్‌ కేకులా అమ్ముడుపోయిన భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్లు

Hyderabad: నిన్న జింఖానా గ్రౌండ్‌లో పెద్ద గందరగోళం తర్వాత.. ఎట్టకేలకు భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. నిన్న రాత్రి పేటీఎంలో రిలీజైన కాసేపటికే హాట్‌ కేకులా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి నేటి నుంచి టికెట్లను పేటీఎం సిబ్బంది పంపిణీ చేయనుంది. జింఖానా గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఇవ్వనున్నారు. గుర్తింపుకార్డు తీసుకొచ్చి టికెట్లు తీసుకెళ్లాలనే నిబంధనను HCA విధించింది. మరోవైపు.. నిన్న జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. ఇవాళ అక్కడ భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక.. ఆదివారం నాడు ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది.




Rama Rao

Rama Rao

Next Story