Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణం

Hyderabad: నారాయణరెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు

Rama Rao
Updated on: 5 July 2022 2:44 PM IST
Software Engineer Narayana Reddy  Murder Case
X

Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణం

Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నారాయణరెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నారాయణరెడ్డిని మామ వెంకటేశ్వర్‌రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న కూతురు, అల్లుడిని ఘనంగా పెళ్లి చేస్తానని పిలిపించి కుమార్తెను గృహ నిర్బంధం చేసినట్లు సమాచాచరం.

వేరే పెళ్లి చేసుకోవాలని తండ్రి ఒత్తిడి చేయడంతో కూతురు నిరాకరించింది. దీంతో అల్లుడిని హత్య చేయాలని సుపారీ ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగ్ నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని టవల్‌ మెడకు చుట్టి హతమార్చారు. జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు నిందితులు.


Rama Rao

Rama Rao

Next Story