Loan App Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Loan App Harassment: సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపిన రామచంద్రరావు

Shekhar G
Published on: 1 Sept 2023 6:43 PM IST
Software Employee Commits Suicide Because Of Loan App Harassment
X

Loan App Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Loan App Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు మరొకరు బలైన ఘటన.. రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. మారుతినగర్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రామచంద్రరావు.. తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు రామచంద్రరావు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. లోన్‌యాప్‌లలో తీసుకున్న డబ్బులు చెల్లించలేనని, తాను తీసుకున్న అప్పును తన తల్లిదండ్రులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందంటూ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. చర్యలు తీసుకొని, మాఫీ చేయాలని కోరుతున్నానంటూ సెల్ఫీ వీడియోను తన తల్లిదండ్రులకు పంపాడు రామచంద్రరావు. సమాచారం అందుకున్న అత్తాపూర్‌ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story