బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు మైకుల ముందే టైగ‌ర్లు : మంత్రి హ‌రీష్ రావు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు మైకుల ముందే టైగ‌ర్లు : మంత్రి హ‌రీష్ రావు
x
Highlights

టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్య మ‌ద్ద‌తు లభిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు వారి వారి...

టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్య మ‌ద్ద‌తు లభిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు వారి వారి పార్టీలను వదిలేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ద్దుల నాగేశ్వ‌ర్ రెడ్డి కూడా ఈ రోజున గులాబీ కండువాను వేసుకున్నారు. సోమవారం రోజున మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో ‌తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ద్దుల నాగేశ్వ‌ర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హ‌రీష్‌రావు నాగేశ్వ‌ర్ రెడ్డికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పార్టీ నాయకుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. కార్య‌క్ర‌మంలో మెద‌క్ ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అయితే నాగేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగారు.

ఇక ఈ సందర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ హుజుర్‌న‌గ‌ర్‌, నిజామాబాద్ ఫ‌లితాలే దుబ్బాక‌లో పున‌రావృతం అవుతాయ‌న్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయింద‌న్నారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ద్దుల నాగేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌వు అని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల నేత‌లు పార్టీల‌ను ఎందుకు వీడుతున్నారో సీనియ‌ర్లు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు. ఆనాడు రైతుల‌కు స‌రిప‌డ క‌రెంట్ ఇవ్వ‌క కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది.. ఇప్పుడేమో బావుల వ‌ద్ద మీట‌ర్లు పెట్టి రైతుల‌ను చంపుతామ‌ని బీజేపీ అంటోంది. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం రైతుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌ను ఇచ్చింద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చింది ఎవ‌రో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని చెప్పారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో 78 వేల మంది రైతుల‌కు రైతుబంధు వ‌స్తోంద‌ని తెలిపారు.

హుజుర్‌న‌గ‌ర్‌లో చెల్లని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట దుబ్బాక‌లో చెల్లుతుందా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు అన్ని తొండి మాట‌లు మాట్లాడుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఫార్మాసిటీ వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని యువ‌త ఎదురుచూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు మైకుల ముందే టైగ‌ర్లు అని మంత్రి హ‌రీష్ రావు విమ‌ర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories