రాష్ట్రానికి తండ్రిలా సీఎం కేసీఆర్‌.. మంత్రి హరీష్ రావు ఆసక్తికర వాఖ్యలు

రాష్ట్రానికి తండ్రిలా సీఎం కేసీఆర్‌.. మంత్రి హరీష్ రావు ఆసక్తికర వాఖ్యలు
x
Highlights

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తండ్రిలాంటి వారని అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు .. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పరిపాలన సాగుతుందని హరీష్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తండ్రిలాంటి వారని అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు .. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పరిపాలన సాగుతుందని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్‌లో నిన్న(శుక్రవారం) 'వానకాలం-2020 నియంత్రిత పంటల సాగు' పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఈ వాఖ్యలు చేశారు.

వానకాలం పంట కోసం రైతుబంధుకు రూ.7 వేల కోట్లు కేటాయించామని, రెండు పంటలకు రూ.14 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని హరీష్ రావు అన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుకు మేలు చేసే ప్రభుత్వమే కానీ రైతుపై రుద్దే ప్రభుత్వం కాదని హరీష్ రావు వాఖ్యానించారు. అంతేకాకుండా తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. ఇక ఇదే సభలో గతంలో పరిపాలించిన అనేక ప్రభుత్వాలు రైతులకు 24 గంటల కరెంట్‌, రూ.5 వేల రైతుబంధు ఇచ్చాయా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఇక రైతులు కూడా ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, అవి అసత్యపు ఆరోపణలని, వారి మాటలను రైతులు తిప్పికొట్టాలని మంత్రి సూచించారు.

ఈ సదస్సులో కలెక్టర్‌ పీ వెంకట్రాంరెడ్డి, శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories