ఉమ్మడి నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు దుప్పటి, హైదరాబాద్ - విజయవాడ రహదారిపై మంచు అందాలు.

Sriveni Erugu
Published on: 2 Feb 2022 9:58 AM IST
Snow covering the  Nalgonda district
X

ఉమ్మడి నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాను దట్టమైన పొగమంచు కప్పేసింది. శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి. ఉదయం 9 గంటలైన మంచు దుప్పటి వీడడం లేదు. హైదరాబాద్ - విజయవాడ, అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచు తెరలు దట్టంగా కమ్ముకున్నాయి. ఉదయాన్నే వ్యాయామం చేసే వాళ్లు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, మున్సిపల్ కార్మికులు చలికి గజగజ వణుకుతున్నారు. మంచుతో పాటు వేగంగా వీస్తున్న అతి శీతల గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story