AP Express: విశాఖ - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌‌లో పొగలు

AP Express: వరంగల్‌ జిల్లా నెక్కొండ సమీపంలో ఘటన

Rama Rao
Updated on: 21 Jan 2022 9:36 AM IST
Smoke on AP Express in Nekkonda Railway Station Warangal District
X

AP Express: విశాఖ - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌‌లో పొగలు

AP Express: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖ - న్యూఢిల్లీ రైలులో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అరగంట పాటు నెక్కొండ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపివేశారు. రైలులో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై స్టేషన్‌లో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు చెలరేగకుండా పొగలను ఆర్పివేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story