పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...

Smoke Biscuits: ఖమ్మంలో ఎంజాయ్‎మెంట్ కోసం క్యూ కడుతున్న టూరిస్ట్స్...

Shireesha
Updated on: 24 May 2022 11:48 AM IST
Smoke Biscuit Attracting Tourists in Lakaram Park in Khammam | Live News Today
X

పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...

Smoke Biscuits: ఖమ్మం నగరంలోని లకారం జలాశయం సింగారించుకుంది. నగర ప్రజలకు ఆహ్లాదం అందిస్తూ స్వాగతం పలుకుతోంది. లకారం అందాలు చూడాల్సిందే తప్ప.. మాటల్లో వర్ణించడం కష్టమంటారు.. ఇక్కడికి వచ్చే సందర్శకులు. లక్నవరం, సిద్దిపేట తరహాలో అన్ని హంగులతో అభివృద్ధి చెందింది. హైద్రాబాద్ ట్యాంక్ బండ్ ను తలపించేలా లకారం ట్యాంక్ బండ్‎ను తీర్చిదిద్దారు. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ బోటులో షికారు చేయడానికి వచ్చే సందర్శకులతో ప్రతిరోజూ కిటకిటలాడుతోంది.

లకారం సందర్శనకు వచ్చేవారిని ఇప్పుడు స్మోక్ బిస్కట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. చిన్నపిల్లలు, ఖమ్మం కుర్రకారు స్మోక్ బిస్కెట్ కోసమే లకారం వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బిస్కట్ నోట్లో వేసుకోగానే పొగలూరే వింత అనుభూతి.. లకారం మరోసారి వచ్చేలా వివశుల్ని చేస్తోందంటున్నారు. నైట్రోజన్ వాయువు కలిపిన ద్రావణంలో ముంచిన బిస్కెట్ నోట్లో వేసుకోగానే... తెరలు తెరలుగా నోరు ముక్కు నుండి వస్తున్న పొగలు యువతకు వింతైన అనుభూతులు పంచుతున్నాయి.

స్మోక్ బిస్కట్స్ తినడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఆరోగ్యపరమైన నష్టాలు గానీ లేవంటున్నాడు షాపు ఓనరు. అంతేకాదు.. దీని మేకింగ్ కోసం తాను హైదరాబాద్ వెళ్లానని, అక్కడ నేర్చుకొని వచ్చానంటున్నాడు. ప్రజలు కూడా ఈ వింత అనుభూతిని విపరీతంగా లైక్ చేస్తుండడం విశేషం.


Shireesha

Shireesha

Next Story