ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: 29 రోజులైనా లభ్యం కాని ఏడుగురి ఆచూకీ

SLBC Tunnel Rescue Operations Enter 29th day
x

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: 29 రోజులైనా లభ్యం కాని ఏడుగురి ఆచూకీ

Highlights

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 29 రోజులు దాటినా ఇంతవరకు ఏడుగురి ఆచూకీ లభ్యం కాలేదు.

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 29 రోజులు దాటినా ఇంతవరకు ఏడుగురి ఆచూకీ లభ్యం కాలేదు. టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రం లభ్యమైంది. సొరంగంలోని డీ1 జోన్ వద్ద ప్రమాదకరమైన పరిస్థితులున్నందున ఇక్కడ జాలి ఏర్పాటు చేశారు. డీ 2 జోన్ వద్ద సహాయక చర్యలు చేస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22 ఉదయం ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ ‌నుంచి 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎనిమిది మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. సొరంగంలోని 40 కి.మీ . వద్ద ప్రమాదం జరిగింది. సొరంగంలోని 39.5 కి.మీ. వరకు రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా వెళ్తున్నారు.ఈ 39.5 కి.మీ. తర్వాతే సొరంగంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీ1, డీ2 జోన్ గా గుర్తించారు.

డీ2 జోన్ లో సహాయక చర్యలు చేస్తున్నారు. డీ1 జోన్ లో జాలిని ఏర్పాటు చేశారు. సొరంగంలో వాటర్ సీపీజీ కారణంగా సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. వాటర్ సీపీజీతో ఏర్పడిన బురదను తొలగిస్తున్నారు. టన్నెల్ లో నాలుగు జేసీబీలు మాత్రమే పనిచేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ సహాయంతో బురదను టన్నెల్ నుంచి బయటకు పంపుతున్నారు. టన్నెల్ లో 300 మీటర్ల మేర బురద నిండిపోయింది. ఈ బురద తొలగించే పనిపై ఫోకస్ పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories