SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది.. ఫ్లెక్సీ ప్రోబ్ ద్వారా గాలింపు

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది.. ఫ్లెక్సీ ప్రోబ్ ద్వారా గాలింపు
x
Highlights

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా ఈ ఎనిమిది మంది సమాచారం మాత్రం రాలేదు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా ఈ ఎనిమిది మంది సమాచారం మాత్రం రాలేదు. ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్,ఎల్ అండ్ టీ బృందాలు టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం కు 40 మీటర్ల దూరం వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. కానీ, అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు రెస్క్యూ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కి.మీ. మేర దూరం నీరు నిలిచింది. ఈ నీటితో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.టన్నెల్‌లోని రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య నీరు నిలిచిింది. టన్నెల్ లో నిలిచిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంప్ చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాల టీబీఎం మిషన్ లోకి వెళ్లాయి. దారిలో ఉన్న వంద మీటర్ల బురదన దాటి టీబీఎంలోకి బృందాలు ప్రవేశించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లో40 మంది పనిచేస్తున్నారు. అయితే ఇందులో 32 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలిన 8 మంది బయటకు రాలేదు.ఈ ఎనిమిది మంది టీబీఎంకు ముందు భాగంలో ఉన్నారు. టీబీఎంకు వెనుక భాగంలో ఉన్న కార్మికులు సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. ఆచూకీ కన్పించకుండాపోయిన వారిలో ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు, నలుగురు రోజువారీ కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు.

టన్నెల్ లో లోక్ ట్రైన్ ను వినియోగిస్తున్నారు. టన్నెల్ 14 కిలోమీటర్లు పూర్తైంది. ప్రమాదం కూడా 14వ కిలోమీటర్ వద్ద జరిగింది. లోక్ ట్రైన్ 9వ కిలోమీటర్ వద్దకే వెళ్తోంది. బురద, నీటి కారణంగా రైలు ముందుకు వెళ్లడం లేదు. మరోవైపు టన్నెల్ లో ఉన్న కన్వేయర్ బెల్ట్ పై రెస్క్యూ బృందాలు ముందుకు సాగుతున్నాయి. ప్రమాదంతో టీబీఎం మిషన్ రెండు ముక్కలైంది. దీంతో ముందు భాగం మట్టిలో కూరుకుపోయింది. వెనుక భాగం ముక్కలై కిలోమీటర్ వెనక్కు వచ్చింది. 1500 టన్నుల బరువు ఉండే టీబీఎం మిషన్ రెండు ముక్కలై కిలోమీటర్ వెనక్కు వచ్చిందంటే ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.మట్టి లోపల ఎక్కడ ఏముందో ప్లెక్సీ ప్రోబ్ అనే పరికరాన్ని పంపారు. దీని ఆధారంగా ఎనిమిది మంది కార్మికులు ఎక్కడ చిక్కుకున్నారో తెలుసుకునే వీలుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories