Sri Rama Navami 2021: వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం

Sri Rama Navami 2021: వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం
x

Sri Rama Navami 2021: వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం

Highlights

Sri Rama Navami 2021: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల విందుగా జరిగింది.

Sri Rama Navami 2021: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల విందుగా జరిగింది. ఏటా అంగరంగ వైభవంగా జరిగే కల్యాణ వేడుకకు రెండో సారి కోవిడ్ ఎఫెక్ట్ పడింది. చైత్ర శుద్ద నవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను ఆహ్వానించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన కళ్యాణం మధ్యాహ్నం 12.30వరకు వైభవంగా జరిగింది.

సీతారాములకు ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది మాత్రమే అనుమతి ఇచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరపారు. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం శ్రేయస్సు దృష్టానే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. రేపు శ్రీ సీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకం జరగనుంది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories