Revanth Reddy: రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్

* ఒకే మండలంలో 100 మందికి 100కి పైగా మార్కులొచ్చాయన్న రేవంత్

Dhatripriya
Published on: 20 March 2023 1:54 PM IST
SIT Notices To Revanth Reddy
X

Revanth Reddy: రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ 

Revanth Reddy: పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. పేపర్ లీక్ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని కోరింది సిట్. లీకేజ్ పై రేవంత్ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. గ్రూప్ -1 పరీక్షలో ఒకే మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు రేవంత్. మంత్రి కేటీఆర్ పేషీ నుంచే వ్యవహారం జరిగిందని కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాలని నోటీసులిచ్చింది సిట్.

Dhatripriya

Dhatripriya

Next Story