Sircilla Municipal Election Results 2026: సిరిసిల్లలో ‘గులాబీ’ ప్రభంజనం: మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్ పాగా.. ఏకపక్ష తీర్పు ఇచ్చిన ప్రజలు!

Sircilla Municipal Election Results 2026: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 13 Feb 2026 12:26 PM IST
Sircilla Municipal Election Results 2026: సిరిసిల్లలో ‘గులాబీ’ ప్రభంజనం: మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్ పాగా.. ఏకపక్ష తీర్పు ఇచ్చిన ప్రజలు!
X

Sircilla Municipal Election Results 2026: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పును అందిస్తూ, కంచుకోటను కాపాడుకునేలా స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు.

అప్రతిహత ఆధిక్యం:

మున్సిపాలిటీలోని మొత్తం 39 వార్డులకు గాను కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి ఇలా ఉంది:

ఇప్పటికే గెలిచిన స్థానాలు: 18 (బీఆర్ఎస్)

ముందంజలో ఉన్న స్థానాలు: 10కి పైగా

మ్యాజిక్ ఫిగర్: సమీపంలో

సిరిసిల్ల పట్టణ అభివృద్ధిని చూసి ఓటర్లు మరోసారి బీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే 18 సీట్లు ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ, మరో పదికి పైగా స్థానాల్లో భారీ లీడ్‌లో కొనసాగుతోంది. దీంతో సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం కేవలం లాంఛనమే అని తెలుస్తోంది. ఫలితాల జోరుతో సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story