సిరిసిల్ల నేతన్న అద్భుతం.. వెండి కొంగుతో పట్టు చీర..

సిరిసిల్ల నేతన్న అద్భుతం.. వెండి కొంగుతో పట్టు చీర..
x
Highlights

చేనేత వస్త్రాలు, బతుకమ్మ చీరల తయారీ ఇలా ఇప్పటిదాకా ఓ బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకున్న సిరిసిల్ల ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వెండి తొడుగుతో పట్టు...

చేనేత వస్త్రాలు, బతుకమ్మ చీరల తయారీ ఇలా ఇప్పటిదాకా ఓ బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకున్న సిరిసిల్ల ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వెండి తొడుగుతో పట్టు చీరని మరమగ్గాల పై తయారీ చేస్తున్నారు సిరిసిల్ల నేతన్నలు. సిరిసిల్ల వెండి తొడుగుతో పట్టు చీరలపై స్పెషల్ స్టోరీ.

అగ్గిపెట్టెలో పట్టే చీరని నేసినా, సూది మొనలో దూరిపోయే చీరలు తయారు చేయాలన్నా అది సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుత సృష్టే.. ఇలా ఎన్నో అద్భుతాలను చేసిన సిరిసిల్ల నేత కార్మికులు ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చి పెట్టారు. అలాటి ఓ బ్రాండింగ్ తో ఇప్పుడు సిరిసిల్ల నేతన్న మగ్గాల నుండి మరో చీర వచ్చింది అదే ఈ పట్టు చీర.

చాలా గ్రాండ్ లుక్ తో పాటు చీర కొంగులో వెండి తొడుగు పెట్టి పట్టు చీరని డిజైన్ చేశారు విజయ్ అనే యువ నేత కార్మికుడు. సిరిసిల్ల లో ఇప్పటిదాకా కాటన్.,పాలిస్టర్ లాంటి వస్త్రాలు నేస్తున్నారు కొత్తగా బతుకమ్మ చీరలను కూడా ప్రభుత్వం గత మూడేళ్ళ నుండి సిరిసిల్ల లోనే తయారీ చేస్తుండటం తో రంగుల రంగుల బతుకమ్మ చీరలు కూడా ఈ సారి ఇక్కడి నేత కార్మికులు నేస్తున్నారు అయితే ఇప్పుడు విజయ్ అనే యువ నేత కార్మికుడు నేసిన ఈ పట్టు చీర అందరిని ఆకర్షిస్తుంది మాములుగా పట్టు చీరల తయారీ అంటే ధర్మవరం.,కంచి లాంటి ప్రాంతాలు గుర్తొస్తుంటాయ్ ఇప్పుడు సిరిసిల్లలో కూడా పట్టు చీరల తయారీ ప్రారంభం అయితే తెలంగాణ కి సిరిసిల్ల మణిహారంగా మారిపోతుంది.

అయితే గతం లోను ఈ యువ నేత కార్మికుడు విజయ్ రకరకాల ప్రయోగాలు చేసాడు. చెట్టు నార తో కూడా చీరను తయారు చేసాడు. అలాంటి ఆలోచనలతోనే జకార్డ్ మగ్గం పై పట్టు చీరని నేసాడు. దీనికి కావాల్సిన ముడి సరుకుని సూరత్ నుండి కొంత తెప్పించాడు.

ఖరీదైన వెండి పట్టు చీరలను గత తరం ఆడవాళ్లు ఎక్కువగా వాడేవాళ్లు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చీరల ట్రెండ్ వస్తున్న నేపథ్యం లో నేత కార్మికుడు విజయ్ సిరిసిల్ల కేంద్రంగా ఇలాంటి చీరలు నేయడం వల్ల సిరిసిల్ల నేతన్నల ప్రతిభ కి మరింత పేరు తెచ్చిపెట్టింది పట్టు చీరలను నేయడం విషయం లో ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ప్రోత్సహం అందిస్తే తెలంగాణ బ్రాండ్ గా సిరిసిల్ల పట్టు చీరలు ప్రపంచానికి పరిచయం అవుతాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories