Bhatti Vikramarka: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Bhatti Vikramarka: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 1:08 PM IST
Bhatti Vikramarka: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన
X

Bhatti Vikramarka: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Bhatti Vikramarka: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు భట్టివిక్రమార్క సమాధానం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story