ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి.. ప్రధాని, రాష్ట్రపతికి నిర్వాసితుడి లేఖ

Sumitra
Published on: 11 Oct 2020 12:08 PM IST
ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి.. ప్రధాని, రాష్ట్రపతికి నిర్వాసితుడి లేఖ
X

ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని ఓ బాధితుడు ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివిరాల్లోకెళితే ఇల్లెందుకు నిర్వాసితుడు లేఖ రాశారు. జీవో 34 ప్రకారం సింగరేణి ఏరియాల్లోని ఎస్టీ నిర్వాసితులకు ఆ సంస్థ ఉద్యోగాలు ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన నిర్వాసితుడు ఇస్లావత్‌ దిలీప్ కుమార్‌ శనివారం విలేకరులతో మాట్లాడాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమని, ఇందుకు అనుమతివ్వాలని ఓ నిర్వాసితుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖలు రాశాడు.

సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఎస్టీ నిర్వాసితులకు జీవో 34 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆదేశాలున్నాయని దిలీప్ తెలిపాడు. అయినా సింగరేణి యాజమాన్యం మాత్రం జీవోను పట్టించుకోవడం లేదని ఈ క్రమంలో తనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని అందుకే తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ దేశ ప్రధానితో పాటు రాష్ట్రపతికి లేఖలు రాశానని పేర్కొన్నాడు.

Sumitra

Sumitra

Next Story