Singareni: షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు

Singareni: నామినేషన్లు వేయడానికి సిద్ధమైన AITUC, BMS

Jyothi
Published on: 6 Oct 2023 9:49 AM IST
Singareni Elections are as Per Schedule
X

Singareni: షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు

Singareni: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలపై మళ్లీ అయోమయం స్టార్ట్ అయింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ యాజమాన్యం ‍హైకోర్టును ఆశ్రయించింది. మరో వైపు షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల వాయిదాపై వాదనలు విన్న కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటున్న సంఘాలు.. ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని ప్రచారం చేస్తుండగా, ఎన్నికలు నిర్వహించాలంటూ కోరుతున్న ఏఐటీయూసీ, బీఎంఎస్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నదని, తాము నామినేషన్లు దాఖలు చేయనున్నామని ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story