Top
logo

Singareni: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

Singareni Collieries Workers Serve Strike Notice
X

Singareni: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

Highlights

Singareni: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది.

Singareni: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ సమ్మె నోటీస్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో పాటు రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌కు సమ్మె నోటీస్‌ పంపింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ డిసెంబర్‌ 9 నుంచి నిరసనలకు పిలుపునిచ్చింది టీబీజీకేఎస్. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని సింగ‌రేణి కార్మికులు స్ప‌ష్టం చేశారు. క‌ల్యాణ్ ఖ‌ని బ్లాక్ -6, కోయ‌గూడెం బ్లాక్ -3, స‌త్తుప‌ల్లి బ్లాక్ -3, శ్రావ‌ణ‌ప‌ల్లి బొగ్గు గ‌నుల‌ను వేలం వేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

Web TitleSingareni Collieries Workers Serve Strike Notice
Next Story