సీఎం సహాయనిధికి సింగరేణి ₹40 కోట్లు విరాళం

సీఎం సహాయనిధికి సింగరేణి ₹40 కోట్లు విరాళం
x
Highlights

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు....

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు. అంతే కాదు కరోనా బాదితులను, పేదవారికి ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి, పీఎం సహాయనిధికి ఎంతో మంది మంచి మనసుతో విరాళాలు ఇస్తున్నారు. ఉద్యోగులు, సినీ ఇండస్ట్రీవారు, అధికారులు, నాయకులు ఇలా ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

తాజాగా కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories