సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు... 146 మంది తెలుగువారు...

సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు... 146 మంది తెలుగువారు...
x
Highlights

కరోనా వైరస్ ని కట్టడిచేయడానికి దేశంలో లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా స్థంబించిపోవడంతో చాలా మంది తెలుగు ప్రజలు సింగ‌పూర్ లో చిక్కుకున్నారు.

కరోనా వైరస్ ని కట్టడిచేయడానికి దేశంలో లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా స్థంబించిపోవడంతో చాలా మంది తెలుగు ప్రజలు సింగ‌పూర్ లో చిక్కుకున్నారు. ప్రస్తుతం వారందరినీ తెలుగు రాష్ట్రాలకు తరలించేందుకు అక్క‌డి తెలుగు స‌మాజం స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 146మంది తెలుగు స‌మాజం సౌజ‌న్యంతో సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బ‌య‌ల్దేరారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ 146 మందిలో 62 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్, 82 మంది తెలంగాణ వాసులు ఉన్నారు. వారిలో మరో ఇద్దరు త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి అన్నారు. అదే విధంగా విమానాలు హైదరాబాద్ కు చేరిన తరువాత 62మంది ఆంధ్రప్రదేశ్ వాసులని వారి స్వస్థలాలకు చేర్చడానికి సాయం చేస్తున్న ఏపీఎన్ ఆర్‌టీ చైర్మన్ మేడపాటి వెంకట్‌కు తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియ‌జేశారు. అదే విధంగా సకాలంలో విమానాలను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటుగానే క‌పిల్ ఏరో సీఈఓ చిన్న‌బాబు, తెలంగాణ అండ్‌ ఏపీ ఏవియేష‌న్ ఎండీ భ‌ర‌త్ రెడ్డికి సింగ‌పూర్ తెలుగు స‌మాజం తరపును జనరల్‌ సెక్రటరీ సత్యా చిర్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories