Harish Rao: దేశానికి అన్నం పెట్టే ధాన్య గారంగా తెలంగాణ మారింది

సిద్ధిపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Rama Rao
Updated on: 15 Jun 2022 6:27 PM IST
Siddipet Market Committee Swearing | TS News
X

సిద్ధిపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Siddipet: సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ మార్కెట్ యార్డ్ లో నూతన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సి లు పారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్లు తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు రాష్ర్ట మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందన్నారు.

గత ప్రభుత్వాలు మార్కెట్ గోడైన్ల కోసం ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ప్రతి మండలంలో ఐదు వేల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మించామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందన్నారు. ఆంధ్రాలో కంటె రెట్టింపు వరి పంట తెలంగాణలో పండిందని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story