సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ

Arun Chilukuri
Updated on: 15 Feb 2021 6:15 PM IST
సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ
X

సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ

సిద్దిపేట జిల్లాలో రైతు వేదిక భవనాల ప్రారంభోత్సవంలో రసాభాస చోటు చేసుకుంది. దుబ్బాక మండలం చిట్టాపూర్, రామక్కపేట, ఆకారం దుబ్బాకలో నూతన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో కొత్త రైతు చట్టాలపై ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ వేదికగా మార్చుకోవడం మానుకోవాలంటూ బీజేపీ నేతలు ఫారూక్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తతత నెలకొన్నది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను శాంతింప చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story