గులాబీ కండువ కప్పుకున్న సిద్దిపేట జిల్లా బీజేపీ నేతలు

X
Highlights
నిజామాబాద్ ఉప ఎన్నికల ఫలితమే రేపు దుబ్బాకలో వస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా రాయపోల్ లో...
Arun Chilukuri13 Oct 2020 10:16 AM GMT
నిజామాబాద్ ఉప ఎన్నికల ఫలితమే రేపు దుబ్బాకలో వస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా రాయపోల్ లో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బాల్ లక్ష్మీ, దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియల్ బీజేపీ గ్రామ అధ్యక్షుడు సురేష్ గులాబీ కండువ కప్పుకున్నారు. పేదప్రజలకు ఎప్పుడు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రిహరీష్ రావు చెప్పారు.
Web Titlesiddipet bjp leaders joined in trs
Next Story