Yadadri Temple - Shravana Masam: యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

Yadadri Temple: * దర్శనానికి 2గంటల సమయం * ఆదివారం, శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ * భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు

Arun Chilukuri
Published on: 29 Aug 2021 2:09 PM IST
Shravana Masam Special Yadadri Temple Crowded with Devotees | Telangana News
X

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం (ఫైల్ ఫోటో )

Yadadri Temple - Shravana Masam: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తులు రద్దీ అధికంగా ఉంది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. యాదాద్రీశుడి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. యాదాద్రిపై ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించ లేదు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story