11మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు

*నిన్న జరిగిన జూమ్ మీటింగ్‌కు హాజరుకాని వారిపై సీరియస్

Jyothi
Published on: 20 Nov 2022 3:12 PM IST
Show Cause Notices to 11 Congress Representatives
X

11మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు 

Congress: నిన్నటి కాంగ్రెస్ జూమ్ మీటింగ్‌కు హాజరు కాని 11మంది అధికార ప్రతినిధులకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. జూమ్ మీటింగ్‌కు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. వాట్సాప్‌లో 11మంది అధికార ప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. శనివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. అయినా మీరు సమావేశానికి హాజరు కాలేదని.... ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తోందని నోటీసులో తెలిపింది.

Jyothi

Jyothi

Next Story