మీరు సైబర్‌ నేరాల బారినపడిన బాధితులా..ఐతే ఇలా చేయండి...

మీరు సైబర్‌ నేరాల బారినపడిన బాధితులా..ఐతే ఇలా చేయండి...
x
Highlights

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్ననేరాలలో సైబర్ నేరాల సంఖ్యే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్ననేరాలలో సైబర్ నేరాల సంఖ్యే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్, లాటరీల పేరిట ఎంతో మంది ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేథ్యంలోనే ప్రజలకు అవగాహన కల్పించడానికి, నేరాల సంఖ్య తగ్గించడానికి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఓ వినూత్న ప్రయత్నాన్ని చేసారు. స్టాలిన్ సినిమాలో ఏవిధంగా థాంక్స్ చెప్పకుండా హెల్ప్ చేయండి అనే కాన్సెప్ట్ ఉందో దాన్నే బేస్ చేసుకుని అడుగు ముందుకేసారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇటీవలి కాలంలో నేరం బారినపడిన వారి నుంచి ఫిర్యాదు స్వీకరించే పోలీసులు బాధితుల సమస్మను తీర్చడమే కాకుండా, అసలు ప్రజల బాధితులుగా మారకుండా ఉండడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పోలీసుస్టేషన్ల వారీగా పంపిణీ చేశారు. ఈ ప్రయత్నం వలన ప్రజలకు ఎంతో కొంత అవగాహన కలిగినప్పటికీ ప్రజలను మరింత చైతన్య పరిచే విధంగా లఘు చిత్రాల తీసారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఫేస్‌బుక్‌ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్, మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌ తో కలిపి ఇప్పటి వరకూ మొత్తం నాలుగు చిత్రాలను నిర్మించారు. దాంతో పాటుగానే ఈ మధ్యకాలంలో ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్, ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్స్‌ అనే రెండు చిత్రాలను రూపొందించారు.

ఈ ప్రయత్నంలో భాగంగానే మరో అడుగు ముందుకేసి సైబర్ నేరాల పై టాలీవుడ్‌ నటులతో చిత్రాలను రూపొందించారు. ఈ లఘు చిత్రాల్లో రెండింటినీ గత నెలలో హ్యకథాన్ కార్యక్రమంలో నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఆవిష్కరించారు. కాగా ఈ సినిమాను మొన్నటి వరకూ నగర పోలీసుల అధికారిక ఫేస్‌బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు నగరాల్లో నిర్వహించే అవగాహన శిబిరాల్లో వీటిని ప్రదర్శిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలను మరింత ఎక్కువ మంది చూసి అవగాహన కల్పించుకోవాలని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ భావించి 'షేరింగ్‌' విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి రోజు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు ఈ లఘు చిత్రాలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు షేర్‌ చేస్తున్నారు. తరువాత ఆ వీడియోని మూడు గ్రూపుల్లో షేర్‌ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. సైబర్‌ నేరాల పట్ల వీలైనంత ఎక్కువ మందికి దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories