Vikarabad: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాలు చోరీ

Vikarabad: వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గొట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని నామినేషన్ పత్రాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 4:24 PM IST
Vikarabad: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాలు చోరీ
X

Vikarabad: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాలు చోరీ

Vikarabad: వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గొట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని నామినేషన్ పత్రాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండాలలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళనకి గురయ్యారు. అయితే అభ్యర్థులెవరూ కంగారు పడొద్దని... నామినేషన్ పత్రాలన్నీ ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి ఉంచామని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story